YCP Offer: జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్..ఆ హామీ ఇస్తే ఓకే అంటున్న సీబీఐ మాజీ అధికారి

YCP Offer: ఏపీ రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. స్వయంగా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2023, 08:25 AM IST
YCP Offer: జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్..ఆ హామీ ఇస్తే ఓకే అంటున్న సీబీఐ మాజీ అధికారి

YCP Offer: యూపీఏ హయాంలో వైఎస్ జగన్ పై సీబీఐ, ఈడీ కేసుల గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసుల్లో అప్పటి సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ..జగన్ కేసుల నేపధ్యలో అందరికీ ప్రాచుర్యమైపోయారు. అలాంటి వ్యక్తి  అదే జగన్ పార్టీలో వస్తే..ఆశ్చర్యంగా ఉంది కదా. అసలేం జరిగిందో తెలుసుకుందాం..

సీబీఐ మాజీ జేడీ ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.. ఆ ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణకు దాదాపు 2 లక్షల 88 వేల ఓట్లు పడ్డాయి. విశాఖ ప్రజలకు తనను ఆదరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. విశాఖ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు దీనినిబట్టి అర్ధమైందన్నారు. ఐపీఎస్‌కు రాజీనామా చేయడం వెనుక కారణాలు వెల్లడించారు. వీఆర్ఎస్ తీసుకునేముందు తాను హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్ డి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్టుకు దరఖాస్తు చేసినట్టు చెప్పారు. ఆ పదవి వచ్చుంటే రాజకీయాల్లోకే వచ్చేవాడిని కానన్నారు. 

తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన అంశాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికీ విశాఖ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని..తాను కోరుకునే అంశాలపై చర్చకు సిద్ధమయ్యే పార్టీలతో కలుస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్, తాను ఒకే కేడర్ అని గుర్తు చేసుకున్నారు. అందుకే తనను రమ్మని ఆఫర్ ఇచ్చినట్టు చెప్పారు. 

మరోవైపు వైసీపీ నేతలు తరచూ లేదా అప్పుడప్పుడూ కలుస్తుంటారని చెప్పారు. పార్టీలోకి రమ్మని అడుగుతుంటారని..2019 ఎన్నికల్లో కూడా వైసీపీలోకి ఆహ్వానించారన్నారు. అయితే గ్రామీణాభివృద్ధి, వ్యవసాయంపై చర్చకు హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని లక్ష్మీ నారాయణ తెలిపారు.

Also read: Rains Alert for Telugu States: ఏపీ, తెలంగాణల్లోని ఆ ప్రాంతాల్లో మరో రెండ్రోజులు వర్షాల హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News