Amaravati: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో మూడు రాజధానుల అంశానికి తెర పడింది. శాశ్వత రాజధాని.. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగనుంది. అమరావతి రూపకర్తగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చారు. దీంతో రాజధానిగా అమరావతికి ఎలాంటి ఢోకా ఉండదు. రాబోయే ఐదేళ్లలో అమరావతికి ఓ రూపం వచ్చే అవకాశం ఉంది. తాజాగా రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని ప్రకటించారు.
Also Read: Rushikonda Palace: కళ్లు చెదిరేలా రుషికొండ ప్యాలెస్ లోపలి అందాలు.. ఒక్క బాత్ టబ్ ధర రూ.28 లక్షలు
వెలగపూడిలోని సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదివారం నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను అమరావతి రైతులు నారాయణను సన్మానించారు. సన్మానం అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. రైతులతో కీలక విషయాలను పంచుకున్నారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. 15 రోజుల్లో అధ్యయనం చేసి సమయం నిర్ణయించుకుని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: Chandrababu: ముఖ్యమంత్రి అయ్యి 24 గంటలు కాలేదు.. అప్పుడే చంద్రబాబుపై ప్రశంసల వర్షం
అన్న క్యాంటీన్లు
అమరావతి రాజధాని తొలి దశ పనులకు రూ.48 వేల కోట్లు ఖర్చవుతాయని మంత్రి నారాయణ అంచనా వేశారు. మొత్తం మూడు దశల్లో రాజధాని నిర్మాణం ఉంటుందని.. వాటికి మొత్తం ఖర్చు రూ.లక్ష కోట్లు ఉంటుందని మంత్రి తెలిపారు. జగన్ పాలనలో రోడ్లు ధ్వంసం, చోరీలు జరగడంపై చర్యలు తీసుకుంటామని, కమిటీ వేసి విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఐదేళ్లుగా రాజధానిలో కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక అన్న క్యాంటీన్‌లపై మంత్రి కీలక ప్రకటన చేశారు. 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. వీటికోసం భోజన సరఫరా బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించడంపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter