ఏపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు విదేశీయాత్రలు చేయడానికి అలవాటు పడ్డారని.. అందువల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదని చెబుతూ ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబుది చిత్తశుద్ధి లేని పాలన అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబును సీఎంగా చూడడం కంటే మంత్రి యనమల రామక్రిష్ణుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లాంటివారిని సీఎంగా చేస్తే.. వారు మెరుగైన పాలనను అందించగలరని రామచంద్రయ్య చెప్పారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే మళ్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం డివిజన్ బిల్లుల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అలాగే జనసేన పార్టీపై కూడా రామచంద్రయ్య తన అభిప్రాయాలు పంచుకున్నారు. జనసేన ఒక ఎజెండా లేని పార్టీ అని ఆయన తెలిపారు.