సీబిఐ నోటీసులపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స

సీబిఐ నోటీసులపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స

Last Updated : Aug 23, 2019, 11:25 PM IST
సీబిఐ నోటీసులపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స

ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు జారీచేసిన నోటీసులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. తాను ఈ కేసులో సాక్షిని మాత్రమేనని అన్నారు. 60వ సాక్షిగా తన వాంగ్మూలం సేకరించడానికి మాత్రమే సీబీఐ పిలిచిందని మంత్రి బొత్స తెలిపారు. 

సీబీఐ కోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే నెల 12న మంత్రి బొత్స సత్యనారాయణ కోర్టు ఎదుట హాజరుకానున్నారని తెలుస్తోంది.

Trending News