GVL Narasimha Rao: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తధ్యం..బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టీకరణ..!

GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఏపీకి అలాంటిదేమి రావడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 28, 2022, 01:40 PM IST
  • మరోమారు తెరపైకి విశాఖ రైల్వే జోన్ అంశం
  • ఇవ్వడం లేదని వార్తలు
  • ఖండిస్తున్న బీజేపీ నేతలు
GVL Narasimha Rao: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తధ్యం..బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టీకరణ..!

GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టత ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదని వస్తున్న వార్తలను ఖండించారు. రైల్వే జోన్ రావడం తధ్యమని తేల్చి చెప్పారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యమని..దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

గత పార్లమెంట్ సమావేశాల్లో దీనికి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందన్నారు. తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ కూడా తాను కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠితో మాట్లాడానని..పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారని తెలిపారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌పై వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని  చెప్పారు. 

విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని వార్తలు వచ్చాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైల్వే అధికారులు స్పష్టం చేశారని ప్రచారం జరుగుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారంతోపాటు రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలపై చర్చ జరిగిందని..ఈసమావేశంలో జోన్‌పై రైల్వే బోర్డు అధికారులు స్పష్టత ఇచ్చారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. 

కొత్త జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని..అందుకే విశాఖ రైల్వే జోన్ డీపీఆర్‌ను ఆమోదించలేదని తెలుస్తోంది. దీనికి ఏపీ ప్రభుత్వ తరపు ప్రతినిధులు అభ్యంతరం తెలిపారని వార్తలు వచ్చాయి. చట్టంలో ఉందని దాని ప్రకారమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని సమాచారం అందుతోంది. ఈసమయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారుల స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని..కేబినెట్‌ ముందు పెడితే ఏదో ఒక నిర్ణయం వస్తుందని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో ఏపీ రాజధాని గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజధానికి రూ.వెయ్యి కోట్లు కోరినట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇస్తామన్నారని..ఇప్పటివరకు రూ.1500 కోట్లు ఇచ్చినందున మిగిలిన వెయ్యి కోట్లు తక్షణమే కేటాయించాలని కోరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా విశాఖ రైల్వే జోన్ అంశంపై మొదటి నుంచి వివాదం కొనసాగుతోంది. దీనిపై కేంద్రప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

Also read:నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. బోరున ఏడ్చేసిన మహేశ్‌ బాబు కుమార్తె సితార!

Also read:IND vs SA Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు దూరమైన కీలక ప్లేయర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News