Vishnuvardhan reddy: వైశ్రాయ్ నుంచి ఏబీఎన్ వరకూ కొనసాగుతోన్న చంద్రబాబు దుశ్చర్య

Vishnuvardhan reddy: ఏబీఎన్ ఛానెల్ చర్చలో దాడికి గురైన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు దుశ్చర్య పరంపర ఇంకా కొనసాగుతోందంటూ నిప్పులు చెరిగారు.  

Last Updated : Feb 25, 2021, 04:10 PM IST
Vishnuvardhan reddy: వైశ్రాయ్ నుంచి ఏబీఎన్ వరకూ కొనసాగుతోన్న చంద్రబాబు దుశ్చర్య

Vishnuvardhan reddy: ఏబీఎన్ ఛానెల్ చర్చలో దాడికి గురైన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు దుశ్చర్య పరంపర ఇంకా కొనసాగుతోందంటూ నిప్పులు చెరిగారు.

ఆంధ్రజ్యోతి పత్రిక ( Andhrajyothi paper )యాజమాన్యంలో నడుస్తున్న ఏబీఎన్ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ( Bjp leader Vishnuvardhan reddy )పై అమరావతి రైతు పరిరక్షణ కమిటీ నేత శ్రీనివాస్ లైవ్‌లో బహిరంగంగా చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటువంటి చర్చల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిగా క్షమాపణలు చెప్పాలని..అప్పటివరకూ ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ఏపీ శాఖ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఘటనపై బాధితుడైన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. 

ట్విట్టర్ వేదికగా విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడి( Chandrababu naidu)పై మండిపడ్డారు. అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్‌ ( Viceroy Hotel)లో తెలుగు జాతి ముద్దుబిడ్డైన ఎన్టీఆర్‌ ( NTR )పై చంద్రబాబు జరిపిన దుశ్చర్య పరంపర..తాజాగా ఏబీఎన్ ( ABN Channel) చర్చా కార్యక్రమంలో తనపై జరిగిన దాడి వరకూ కుట్ర కోణం  కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. భౌతికదాడులతో బీజేపీ నేతల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం మూర్ఖపు ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున ప్రశ్నించడంలో తాను వెనుకడుగు వేసేదిలేదని, ఇటువంటి దాడులకు బెదిరేది కూడా లేదన్నారు. అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని నీచపు రాజకీయ సంస్కృతితో తమ గొంతునొక్కడం అసాధ్యమని తెలిపారు. ప్రజా సమస్యలపై మరింత ఎక్కువగా రెట్టింపుగా తన స్వరం విన్పిస్తానని విష్ణువర్ధన్ రెడ్డి  ట్వీట్ చేశారు. తన మీద, తమ పార్టీ మీద టీడీపీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైనా మానుకుంటే మంచిదని విష్ణువర్థన్‌రెడ్డి హితవు పలికారు.

Also read: Ap High Court: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌‌పై హైకోర్టులో కీలక పరిణామాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News