R Krishnaiah Resign: తన తండ్రి వైఎస్సార్ మాట ఇచ్చాడని గుర్తు పెట్టుకుని మరి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరికి ఎంపీ పదవి ఇస్తే ఆయన మాత్రం తాజాగా రాజీనామా చేశారు. ఆయనే బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ర్యాగ కృష్ణయ్య అలియాస్ ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ పదవికి ఆయన అనూహ్యంగా రాజీనామా చేశారు. చేయడమే కాదు రాజ్యసభ చైర్మన్ అతడి రాజీనామాను ఆమోదించారు. త్వరలోనే ఆయన బీజేపీలో లేదా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
Also Read: AP Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు కీలక పదవీ..
బీసీ ఉద్యమాలను చేపడుతూ రాజకీయాల్లో కొనసాగుతున్న ఆర్ కృష్ణయ్య గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. అంతకుముందు ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కృష్ణయ్యకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. బీసీ వర్గం నుంచి రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు. అయితే వైఎస్సార్ చనిపోయిన తర్వాత సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ గుర్తు పెట్టుకుని మరి కృష్ణయ్యకు 2022 జూన్ లో ఎంపీ పదవి ఇచ్చారు.
ఇదీ చదవండి: టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..
దాదాపు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగిన ఆర్ కృష్ణయ్య మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజ్యసభను వదులుకున్నారు. వైఎస్సార్సీపీలో ఆయనకు సభ్యత్వం లేదు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన జీవితం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ద్వారా మొదలైంది. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు రాజ్యసభలో బలం లేకపోవడంతో బీజేపీ వరుసగా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తోంది. ఇటీవల బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లులు ఆమోదం పొందేందుకు మార్గం సులువు చేసుకుంటోంది. త్వరలోనే మరికొందరితో బీజేపీ రాజీనామాలు చేయించే అవకాశం ఉంది.
కాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. ఇప్పుడు కృష్ణయ్యతో రాజకీయంగా వైఎస్ జగన్‌కు భారీ నష్టం ఏర్పడుతోంది. త్వరలోనే మరో ఇద్దరు ముగ్గురు రాజీనామా చేస్తారని సమాచారం. జాతీయ, రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ పూర్తిగా ఖాళీ అవుతోంది. తాజా రాజీనామాతో వైసీపీ బలం 8కి చేరింది. అయితే కృష్ణయ్య రాజీనామా మాత్రం ఊహించనిది. ఎప్పుడో ఇచ్చిన మాట వలన పిలిచి మరి ఎంపీ పదవి ఇస్తే విశ్వాసం లేకుండా రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ఆయన రాజీనామా చేయడం వెంటనే చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆమోదం తెలపడం అన్నీ చకాచకా చేయడం ఆసక్తికరంగా మారింది. జమిలి ఎన్నికల బిల్లు కోసం బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోందని ఈ పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.