Bandaru Sravani Sree: వేసవికాలం ఎండలు ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే తమ రాజకీయం కోసం నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ.. వాడవాడలా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎండదెబ్బకు గురయింది. ప్రచారంలో వడదెబ్బకు గురయి తీవ్ర అస్వస్థతకు గురయిన ఆమె ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. కొన్ని రోజులుగా ఆమె ప్రచారంలో పాల్గొనడం లేదు.
Also Read: Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు
అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం నుంచి బీజేపీ జనసేన తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ పోటీలో నిలబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ అట్టహాసంగా వేసిన ఆమె అనంతరం ఊరూరా.. వీధివీధి తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా ఆమె ఖాతరు చేయకుండా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు.
Also Read: Narendra Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే
విరామం లేకుండా ప్రచారం చేస్తున్న బండారు శ్రావణి అస్వస్థతకు గురయ్యారు. ఎండదెబ్బ తగలడంతో ఆమె నీరసించిపోయారు. వడదెబ్బకు గురవడంతో ప్రస్తుతం శ్రావణి ఇంట్లోనే వైద్య సేవలు పొందుతోంది. ఆమెను పరిశీలించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యం అందించిన అనంతరం మందులు ఇచ్చారు. వడదెబ్బకు గురయి శ్రావణి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారని.. ఆమె వీలైనంత ఎక్కువగా ఎండలో తిరగకూడదని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం బండారు శ్రావణి ఇంట్లోనే విశ్రాంతి పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే అభ్యర్థి అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అభ్యర్థి లేకుండా పార్టీ కార్యకర్తలు చేయలేకపోతున్నారు. అయితే బండారు శ్రావణికి బదులుగా ఆమె సోదరి బండారు కిన్నెర శ్రీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రభావం చూపుతుందా?
ప్రచారంలో అభ్యర్థి పాల్గొనకపోవడంతో ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అస్వస్థతకు గురయిన శ్రావణి దాదాపు వారం రోజులుగా ప్రచారంలో పాల్గొనడం లేదు. ఎన్నికలకు ఇంకా వారం కూడా సమయం లేదు. ఈ సమయంలో ఆమె ప్రజల్లో తిరగకపోతే ఓట్లు రావనే అభిప్రాయం ఉంది. దీనికితోడు స్థానికంగా టీడీపీకి బీజేపీ జనసేన సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె పర్యటించకపోతే నష్టం వాటిల్లుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇక్కడి నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాన్యుడికి అవకాశం కల్పించింది. మన్నెపాక వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వడంతోనే వైసీపీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ప్రధాన పోటీదారైన శ్రావణి అస్వస్థత వీరాంజనేయులు గెలుపుకు దారి తీస్తుందనే వార్త వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter