Golden Chariot: అసనీ తుపాను ప్రభావం, సముద్రంలో కొట్టుకొచ్చిన బంగారు రధం, ఏ దేశానిది

Golden Chariot: అసనీ తుపాను ప్రభావం సంగతెలా ఉన్నా ఆ సముద్రపు ఒడ్డున ఓ వింత చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చిందో..ఎక్కడిదో తెలియదు గానీ ఓ బంగారం రధం కొట్టుకొచ్చింది. ఆ వివరాలివీ...

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2022, 08:10 PM IST
  • అసనీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం సముద్రతీరంలో ఓ వింత
  • శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నంపల్లి రేవుకు కొట్టుకొచ్చిన బంగారు రధం
  • రధం ఆకృతిని బట్టి థాయ్లాండ్, జపాన్, మలేషియా దేశాలది కావచ్చని భావిస్తున్న మెరైన్ పోలీసులు
Golden Chariot: అసనీ తుపాను ప్రభావం, సముద్రంలో కొట్టుకొచ్చిన బంగారు రధం, ఏ దేశానిది

Golden Chariot: అసనీ తుపాను ప్రభావం సంగతెలా ఉన్నా ఆ సముద్రపు ఒడ్డున ఓ వింత చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చిందో..ఎక్కడిదో తెలియదు గానీ ఓ బంగారం రధం కొట్టుకొచ్చింది. ఆ వివరాలివీ...

అసనీ తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్రలో కన్పిస్తోంది. విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాలు పడుతున్నాయి. రెండ్రోజుల్నించి రాష్ట్రంలోని తీరప్రాంతంలో అలలు ఎగసిపడుతున్న పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా అసనీ తుపాను ప్రభావం సంగతెలా ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఓ వింత జరిగింది. తుపాను కారణంగా జిల్లాలోని సంతబొమ్మాళి మండలం..సున్నాపల్లి రేవుకు ఓ బంగారు రధం కొట్టుకొచ్చింది. ఈ రధం చెక్కుచెదరకుండా ఉండి..బంగారం తాపడం చేసినట్టుుంది. రధంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసుంది. అంటే ఈ రధాన్ని ఇటీవలే తయారు చేసినట్టున్నారు. 

రధం ఆకృతి, భాషను బట్టి మలేషియా, థాయ్‌లాండ్, జపాన్ దేశాలకు చెందిన రధం కావచ్చని స్థానికులు చెబుతున్నారు. గతంలో పెద్ద పెద్ద తుపాన్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటివేవీ సముద్రంలో కొట్టుకురాలేదు. ఈ రధం ఎక్కడ్నించి కొట్టుకువచ్చిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రధాన్ని చూసేందుకు సంతబొమ్మాళి సముద్రం ఒడ్డుకు జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారు. బంగారం రంగుతో చక్కని ఆకృతి కలిగిన ఈ రధం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ రధం ఆకృతి జపాన్‌కు చెందిన వేలో శైలి ఆర్కిటెక్చర్‌కు దగ్గరగా ఉంది.

ప్రస్తుతం అసనీ తుపాను బలహీనపడింది. రేపటికి మరింతగా బలహీనపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. మరి కొద్దిగంటల్లో అసనీ తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి చేరుకోనుంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. 

Also read: Ys Jagan Review: తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ఉండాలని ఆదేశించిన వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News