ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టిన 2 రూపాయలు

రెండు రూపాయలు ఒక జిల్లా అధికారి ఉద్యోగాన్ని పోగొట్టిందంటే నమ్ముతారా?

Last Updated : Jun 6, 2018, 10:15 AM IST
ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టిన 2 రూపాయలు

రెండు రూపాయలు ఒక జిల్లా అధికారి ఉద్యోగాన్ని పోగొట్టిందంటే నమ్ముతారా? ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాశాఖలో ఎండీ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ బస్‌డిపోలో ఓ కండక్టర్ కలెక్షన్ ను అప్పచెప్పుతూ రూ.2 వేరుగా ఇవ్వగా రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న  క్లర్క్ ఎదో పరధ్యానంలో ఉండి గమనించలేదు. ఈ విషయం తెలిసిన రీజనల్ మేనేజర్ అతడిని సస్పెండ్ చేయాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు. ఇందులో దురుద్దేశం లేదని, మర్నాడే తన రిటైర్మెంట్ అని చెప్పినా విన్పించుకోలేదు. ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు వద్దకు క్లర్క్ వెళ్ళగా సస్పెన్షన్ ఎత్తేసి.. ఇలా చేసిన ఆర్ఎంనే తొలగించాలనుకున్నారు. ఆర్ఎం బ్రతిమాలడంతో కాస్త తగ్గి వీఆర్ఎస్ తీసుకోమన్నాడు. దీంతో రాజీనామా చేశారాయన. ఆర్టీసీలో సిబ్బంది తప్పు చేస్తే ప్రతిదానికీ సస్పెన్షన్‌ ఉండబోదని, ఏ తప్పునకు ఎలాంటి చర్య ఉండాలో మార్గదర్శకాలు రూపొందించి అమలు చేస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో ఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Trending News