YS Jagan Davos Tour: దావోస్ వేదికగా ఏపీకు లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి బాటలో విశాఖ

Davos Tour: ప్రపంచ ఆర్ధిక మండలి సదస్సు..ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్‌లో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2022, 12:43 PM IST
YS Jagan Davos Tour: దావోస్ వేదికగా ఏపీకు లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి బాటలో విశాఖ

YS Jagan Davos Tour: ప్రపంచ ఆర్ధిక మండలి సదస్సు..ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్‌లో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి.

దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక మండలి సదస్సు..ఏపీకు వరంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో సదస్సుకు హాజరైన ప్రతినిధి బృందం విజయం సాధించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టింది. దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో 1.25 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకుంది.

దావోస్ వేదికగా జరిగిన ఏపీ ప్రభుత్వ బృందం పర్యటనలో ఆశించిన ఫలితాలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీకు సంబంధించి 1 లక్షా 25 వల కోట్లు రూపాయలు పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో ఒప్పందం పూర్తయింది. పంప్డ్ స్టోరేజ్ వంటి వినూత్న విధానాలతో 27 వేల 7 వందల మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలో అందుబాటులో రానుంది. ఆర్సెలర్ మిట్టల్ తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. అదే సమయంలో కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రబిందువుగా నిలుస్తోందని నీతి 
ఆయోగ్ కూడా కితాబిచ్చింది. 

గ్రీన్ ఎనర్జీ సెజ్, హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నంను తీర్దిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మచిలీపట్నంలో సెజ్ ఏర్పాటు దావోస్ విజయాల్లో ఒకటని తెలిపింది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడమే కాకుండా..అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు జోన్ అభివృద్ధి అవుతుందనని స్పష్టం చేసింది. 

Also read: CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ టూర్ సక్సెస్..రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News