AP SSC 10th Results 2023 Date and Time Announced: ఏపీలో శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మే రెండో వారంలో ఫలితాలు విడుదల అవుతాయని ముందుగా ప్రచారం జరిగినా.. మార్కుల టేబులేషన్, అప్లోడ్ ప్రక్రియ పూర్తవ్వడంతో రేపు విడుదల చేయనున్నారు. కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే.. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం కూడా పూర్తి చేశారు. స్పాట్ వాల్యుయేషన్‌లో దాదాపు 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. bse.ap.gov.in. వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఫలితాల తేదీ ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవసరమైన వారి రోల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని బోర్డు విద్యార్థులకు సూచించింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాలలో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ని bse.ap.gov.inలో సందర్శించండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో "ఫలితాలు" విభాగంపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీరు "SSC ఫలితాలు 2023"ని పేజీలోకి వెళతారు.
స్టెప్ 4: ఇక్కడ మీ హాల్ టిక్కెట్ నంబర్, ఏవైనా అవసరమైన ఇతర వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 5: సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: మీ పదో తరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు సూచన కోసం మీరు ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.
Also Read: YS Sharmila: మాకు నమ్మకం లేదు దొరా.. సిట్‌తోనే మమ అనిపిస్తున్నారు: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook