AP SSC Exams Schedule Released: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
పరీక్షల తేదీలు..
ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8న ఆంగ్లం
ఏప్రిల్ 10న గణితం
ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం
ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు పరీక్ష
ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్ష
ఏప్రిల్ 17న జరిగే కంపోజిట్ కోర్సుల్లో ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.15 గంటల వరకు 30 మార్కులకు ఉంటుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులకు సంస్కృతం, అరబిక్, పర్షియన్ కోర్సుల్లో ఏప్రిల్ 17వ తేదీన 100 మార్కుల పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు.
అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీన ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్సుల్లో భాగంగా మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షను సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల్లో థియరీ పరీక్షలు కూడా అదే తేదీన జరగనున్నాయి.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసినందున పబ్లిక్ హాలీడేలు, సాధారణ సెలవులు ప్రకటించినా అదే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ఎస్సెస్సీ బోర్డు తెలిపింది. విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే ఎగ్జామ్స్ రాయాలని.. ఎగ్జామ్ సెంటర్ మార్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు పదో తరగతి పరీక్షల కోసం 6.60 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. కేజీబీవీ విద్యార్థులతో పాటు దివ్యాంగులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. అదేవిధంగా 125 రూపాయల కంటే ఎక్కువ పరీక్ష ఫీజు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా ఆలస్య రుసుముతో ఫీజు స్వీకరిస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. జనవరి 3వ వరకు 200 ఆలస్య రుసుముతో ఫీజులు చెల్లించవచ్చని చెప్పారు. ఇక 500 రూపాయల ఫీజుతో జనవరి 9వ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ వీడియో వైరల్
Also Read: Pele Passes Away: పీలే రాకతో కిక్కిరిసిపోయిన కోల్‌కతా నగరం.. పులకరించిన ఈడెన్ గార్డెన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి