SEC vs Nominations: మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

SEC vs Nominations: ఆయన తీసుకునే నిర్ణయం వివాదాస్పదమవుతుందో లేదా వివాదాస్పద నిర్ణయమే ఆయన తీసుకుంటున్నారో తెలియదు గానీ..ఏపీ ఎన్నికల కమీషనర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదమవుతోంది. ఇప్పుడు మరో నిర్ణయం వివాదంగా మారింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2021, 07:37 PM IST
  • మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మళ్లీ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
  • ఏకగ్రీవమైన 11 స్థానాల్లో రీ నామినేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసీ
  • ఏకగ్రీవమైన ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్ధులు ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే యోచన
SEC vs Nominations: మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

SEC vs Nominations: ఆయన తీసుకునే నిర్ణయం వివాదాస్పదమవుతుందో లేదా వివాదాస్పద నిర్ణయమే ఆయన తీసుకుంటున్నారో తెలియదు గానీ..ఏపీ ఎన్నికల కమీషనర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదమవుతోంది. ఇప్పుడు మరో నిర్ణయం వివాదంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్( Sec nimmagadda ramesh kumar )‌తో ప్రభుత్వానికి నెలకొన్న ఘర్షణ ఆగడం లేదు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్ని కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసినప్పటి నుంచి ప్రారంభమైన వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇటీవల ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రతిసారీ అటు ప్రభుత్వం గానీ ఇటు మంత్రులు గానీ కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల( Municipal Elections)సందర్భంగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

2020 మార్చ్ నెలలో ఆగిపోయిన చోటి నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. అప్పట్లో కొన్ని ఏకగ్రీవాలయ్యాయి. ఇప్పుడు ఆ ఏకగ్రీవాలకు సంబందించి ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయం వివాదమవుతోంది. అప్పట్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్‌కు ( Renomination) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించినందునే రీ నామినేషన్‌కు అవకాశమిస్తున్నట్టు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాల్టీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవా స్థానాల్లో రీ నామినేషన్ జరగనుంది. రేపు అంటే మార్చ్ 2 వ తేదీ మద్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్  వేయాల్సి ఉంది. అయితే ఏకగ్రీవమైన 11 చోట్ల గెలిచిన అభ్యర్ధులు దీనిపై అభ్యంతరం చెబుతున్నారు. ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించనున్నారు. 

Also read: Polavaram project: పోలవరం పనులపై ముగిసిన కీలక సమీక్ష, ఎత్తు తగ్గింపుపై నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News