AP Mlc Elections: మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మెజార్టీ ఉన్నా అధికార పార్టీ భయానికి కారణమేంటి

AP Mlc Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మెజార్టీ ఉన్నా అధికార పార్టీలో భయం మొదలైంది. జంపింగ్ జపాంగ్‌లు ఉన్నారనే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2023, 10:23 AM IST
AP Mlc Elections: మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మెజార్టీ ఉన్నా అధికార పార్టీ భయానికి కారణమేంటి

AP Mlc Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఏడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పూర్తి మెజార్టీ ఉన్నా అధికార పార్టీకు ఎందుకో టెన్షన్ పట్టుకుంది. ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకున్న సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ.

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలు 7 ఉన్నాయి. ఈ ఏడు స్థానాలకు పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. గెలవాలంటే ఒక్కొక్క ఎమ్మెల్సీకు 22 ఓట్లు అవసరం. ఈ లెక్కన బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ గెలిచేందుకు అన్ని అవకాశాలున్నట్టే. కానీ టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ వైపున్నారు. అంటే టీడీపీ బలం 19కు తగ్గింది. ఎప్పుడో స్పీకర్ ఫార్మట్‌లో సమర్పించిన మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అధికార పార్టీ వ్యూహాత్మకంగా నిన్న ఆమోదించింది. దాంతో టీడీపీ బలం 18కు తగ్గిపోయింది. అయినా వైసీపీలో ఎందుకు టెన్షన్ అనేదే ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి కారణాలు లేకపోలేదు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు పార్టీపై తిరుగుబాటు ప్రదర్శించారు. ఈ రెండు ఓట్లు టీడీపీకు వెళ్లే అవకాశాలున్నాయి. అంటే ఈ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటేస్తే టీడీపీకు ఇప్పుడున్న బలం 18కు రెండు అదనంగా పెరిగి 20కు చేరుకుంటుంది. అంటే టీడీపీ అభ్యర్ధి అనూరాధ గెలవాలంటే మరో రెండు ఓట్లు కావల్సి ఉంటాయి. అధికార పార్టీలో ఉంటూ లోలోపల అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్యేలపై టీడీపీ గాలం వేసినట్టు అర్ధమౌతోంది. టీడీపీ కనీసం ముగ్గురిని టార్గెట్ చేసినట్టుగా సమాచారం. ఒకవేళ టీడీపీ వ్యూహం ఫలిస్తే అధికార పార్టీ ఓ స్థానం కోల్పోవడం ఖాయం.

అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాల్ని పరిశీలిస్తోంది. వైసీపీ ప్రస్తుతం తన బలాన్ని 154 గానే తీసుకుంటూ 7 టీమ్ లుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్ అప్పగించారు. అసంతృప్తితో ఉన్న ఆ ఇద్దరు తప్ప మరే ఓటు పోకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరిపై నిశిత పరిశీలన చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పనితీరు ఆధారంగా కొందరు టికెట్లు కోల్పోయే అవకాశాలున్నాయి. అలాంటివారిని టీడీపీ టార్గెట్ చేసినట్టుగా తెలియడంతో అధికార పార్టీలో ఈ టెన్షన్ ప్రారంభమైంది.

అదే సమయంలో టీడీపీ నుంచి ఇప్పటికే వైసీపీ వైపున్న నలుగురు కాకుండా మరో ఇద్దరు వైసీపీకు ఓటేసే అవకాశాలు కూడా లేకపోలేదని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. 

Also read; AP MLA Quota MLC Elections: ఏపీలో నేడే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News