AP Corona Update: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా..

AP Corona Update: ఏపీలో కొత్తగా 2 వేల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీలు 10 వేలకుపైనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా కొవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 06:43 PM IST
  • రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరకోనా ఉద్ధృతి
  • 60 వేల దిగువకు చేరిన యాక్టివ్ కేసులు
  • 10 వేల పైనే రికవరీలు నమోదు
AP Corona Update: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా..

AP Corona Update: ఆంధ్ర ప్రదేశ్​లో కరోనా కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 1,891 కేసకులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 26,236 పరీక్షలకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు తెలిపిందపి ఆరోగ్య విభాగం.

రికవరీలు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులో 10,241 కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,238,226 వద్దకు చేరింది.

రాష్ట్రంలో ఇంకా 54,040 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరణాలు ఇలా..

రాష్ట్రంలో తాజాగా 5 మంది కొవిడ్​కు బలయ్యారు. దీనితో రాష్యాప్తంగా కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,677కు చేరింది.

జిల్లాల వారీగా కేసులు ఇలా..

అనంత పురం (90), చిత్తూరు (91), తూర్పు గోదావరి (440), గుంటూరు (222), కడప (58), కృష్టా (356), కర్నూల్ (67), నెల్లూరు (70), ప్రకాశం (141), శ్రీకాకుళం (21), విశాఖపట్నం (121), విజయనగరం (28), పశ్చిమ గోదావరి 186 కొవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం అధికారిక డేటాలో వెల్లడింది.

Also read: Ratha Saptami 2022: రథసప్తమి వేడుకల సందర్భంగా ఆలయంలో అద్భుతం!

Also read: AP new districts: 'విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలి.. లేదంటే ఉద్యమిస్తాం'!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News