Andhra Pradesh: రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనా వైరస్ ( Coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదు అయ్యాయి. 

Last Updated : Jul 13, 2020, 07:53 PM IST
Andhra Pradesh: రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

Coronavirus: అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనా వైరస్ ( Coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదు అయ్యాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు 1,935 కరోనా కేసులు నమోదు కాగా.. 37 మంది మరణించారు. నమోదైన కేసుల్లో.. రాష్ట్రానికి చెందినవి 1,919 కేసులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 13 మంది, ఇతర దేశాల వారు ముగ్గురు ఉన్నారు. Also read: Corona Effect: తిరుపతిలో నేటి నుంచి కొత్త రూల్

ఇప్పటివరకు రాష్ట్రంలో 31,103 మందికి కరోనా సోకింది.  వాటిలో రాష్ట్రానికి చెందిన వారు 28,255, ఇతర రాష్ట్రాల వారు 2,416, ఇతర దేశాల వారు 432మంది ఉన్నారు. గత 24 గంటల్లో మరణించిన 37 మందితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 365 మంది ప్రాణాలు కోల్పోయారు.  COVID-19: రష్యాలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి

ప్రస్తుతం రాష్ట్రంలో 14,274 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు డిశ్చార్జ్ అయిన 1,030మందితో మొత్తం 16,464మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News