AP PRC Issue: ఆన్‌లైన్‌లో ఏపీ ఉద్యోగుల కొత్త జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్స్‌ రెడీ!

AP PRC issue latest updates: ఒకవైపు కొత్త పీర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనలు చేయడం.. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల్ని చర్చలకు పిలవడం వంటివి నడుస్తుండగానే.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను, పింఛన్‌ వివరాలను ఖరారు చేసి ఆన్‌లైన్లో పెట్టేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 10:47 AM IST
  • కొత్త పీర్సీ ప్రకారంగా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్స్‌ రెడీ
  • వివరాలను ఎవరైనా సరే చూసుకోవచ్చంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల ప్రకటన
AP PRC Issue: ఆన్‌లైన్‌లో ఏపీ ఉద్యోగుల కొత్త జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్స్‌ రెడీ!

AP PRC issue Updates: ఏపీ ప్రభుత్వం.. సీఎఫ్ఎస్ఎస్ సహకారంతో కొత్త పీర్సీ ప్రకారంగా ఉద్యోగుల జీతాలను అలాగే పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్స్‌ను రెడీ చేసింది. ఇక ట్రెజరీ అధికారులతో పాటు డీడీఓలు ఎస్సాఆర్‌‌లు పరిశీలించి చేయాల్సిన ప్రక్రియను కూడా టెక్నాలజీ సాయంతో పూర్తి చేసింది. 

కొత్త వేతన స్కేల్స్‌ ప్రకారంగా.. ఎవరికి ఎంత వేతనం వస్తుంది... అలాగే ఎంత పింఛన్‌ వస్తుందనే విషయాల్ని ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. (AP Government) ఇక ఆ వివరాలను ఎవరైనా సరే చూసుకోవచ్చంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తాజాగా ఒక ప్రకటన కూడా చేశారు. 

https://payroll.herb.apcfss.in/login వెబ్‌సైట్‌లో డిటేల్స్‌ మొత్తం పొందుపరిచారు. యాండ్రాయిడ్ లేదంటే ఐఓఎస్‌ మొబైల్ యాప్స్‌లలో లేదంటే సీఎఫ్‌ఎస్ఎస్‌లో మొబైల్‌ నంబర్‌‌ రిజిస్టర్‌‌ అయి ఉన్నా సరే దానితో ఒక లింక్‌ పొంది అలా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీలో (AP) దాదాపు పదహారువేలకు పైగా డీడీఓల్లో కేవలం కొంత మంది మాత్రమే జీతాల బిల్లుల్ని సబ్‌మిట్ చేశారు. అయినా కూడా కొత్త పీర్సీసీ (PRC) ప్రకారమే జనవరికి సంబంధించి వేతనాల్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయి ఆ మేరకు చర్యలు చేపట్టింది. దీంతో పే స్లిప్స్‌, పెన్సనర్స్ స్లిప్స్ రెడీ చేసింది.

ఇదిలాఉండగా.. మరో వైపు కొత్త పీర్సీని వ్యతిరేకిస్తోన్న ఏపీ (AP) ఉద్యోగులు తమకు కొత్త వేతనాల బిల్లుల్ని సిద్ధం చేయవద్దంటున్నారు. ఈ మేరకు డీడీఓలకు లేఖల్ని రాశారు. దీంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. పోలీసులతో పాటు సుమారు నాలుగు లక్షల ఇరవై వేలకు పైగా మంది ఉద్యోగులుండగా.. (Employees) కేవలం అరవై వేల మందికి సంబంధించిన బిల్లులు మాత్రమే ట్రెజరీ అధికారులు ప్రాసెస్‌ చేశారని సమాచారం.

Also Read: Union Budget 2022 Live: నేడు పార్లమెంట్​ ముందుకు బడ్జెట్​ 2022..

Also Read: Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్‌‌లో బీమారంగం ఆశలు ఫలించేనా..ప్రీమియం ధర తగ్గుతుందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News