AP Politics: ఏపీలో మారిన రాజకీయ వాతావరణం, బీజేపీ, వైసీపీ మధ్య రాజుకున్న అగ్గి

AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 13, 2023, 12:10 AM IST
AP Politics: ఏపీలో మారిన రాజకీయ వాతావరణం, బీజేపీ, వైసీపీ మధ్య రాజుకున్న అగ్గి

AP Politics: ఏపీలో గత రెండ్రోజుల్లో జరిగిన బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాల పర్యటనతో రాజకీయం మారిపోయింది. నిన్నటి వరకూ సఖ్యతగా ఉన్న వైసీపీ, బీజేపీల మధ్య అగ్గి రాజుకుంది. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేతలు విమర్శలు చేయడంతో..ముఖ్యమంత్రి జగన్ సహా అందరూ విరుచుకుపడుతున్నారు. 

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎన్నడూ లేనిది బీజేపీ అగ్ర నాయకత్వం ఒక్కసారిగా విమర్శలు గుప్పించడం ప్రారంభించింది. ఆ పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలు వరుసగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుపోయిందని సాక్షాత్తూ కేంద్ర హోంత్రి ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడవ స్థానంలో ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు అమిత్ షా. కేంద్రం ఇస్తున్న నిధుల్ని తానేదో ఇస్తున్నట్టుగా వైఎస్ జగన్ రైతుల్ని మభ్యపెడుతున్నారన్నారు. 

దీంతో ఇప్పటి వరకూ బీజేపీ కేంద్ర నాయకత్వంపై విమర్శలు చేయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా నేతలంతా స్పందిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా స్పందించారు. జరిగే సంగ్రామంలో తన ధైర్యం, బలం అంతా ప్రజలేనని బీజేపీకు పంచ్ వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీజేపీని ఎప్పుడూ నమ్ముకోలేదని స్పష్టం చేశారు. ఆ తరువాత వరుసగా మంత్రులు గుడివాడ అమర్‌నాథ్ సహా వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ కాస్తా టీజేపీగా మారిందన్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా లేని బీజేపీ 20 సీట్లు ఎలా ఆశిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఏపీకు ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు. ఇప్పటివరకూ కనీసం విభజన హామీలే పరిష్కరించలేదని మండిపడ్డారు. 

టీడీపీ ట్రాప్‌లో బీజేపీ పడిపోయిందని ఇంకొందరు విమర్శించారు. టీడీపీ మాటల్నే అమిత్ షా వల్లెవేశారన్నారు. అమిత్ షా సభా వేదికపై ఉన్న నేతలంతా పసుపు నేతలేనని గుర్తు చేశారు. విశాఖ వచ్చిన అమిత్ షా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మొత్తానికి వైసీపీ బీజేపీ మధ్య అగ్గి రాజుకుంది. ఎన్నికల నాటికి ఈ అగ్గి దావానలంలా వ్యాపించవచ్చు కూడా. 

Also read: AP Inter Results 2023: రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఇలా https://resultsbie.ap.gov.in/ చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News