ఏపీలో కరోనా చుట్టూ రాజకీయాలు అల్లుకుంటున్నాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. అబద్ధాలు చెబుతూ..విజ్ఞత పూర్తిగా కోల్పోయి మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై మండిపడుతున్నారు.
ఏపీలో కరోనా మరణాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి పదిసెకన్లకు ఒకరు చనిపోతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నారని...వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్న తీరు అత్యంత దారుణమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు విజ్ఞత కోల్పోయి..సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. Also read: Ap: లక్షకు చేరువలో కరోనా కేసులు
ఓ వైపు కోవిడ్ తో జనం అల్లాడుతుంటే చంద్రబాబు ముఖంలో ఆనందం కన్పిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రికవరీ రేటు 48.78 శాతం ఉండగా..మరణాల రేటు 1.11 శాతం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పరీక్షల సామర్ధ్యం పెరిగే కొద్దీ కేసులు పెరుగుతున్నా...అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజల్నిభయపెడితే మంచిది కాదని హెచ్చరించారు. చంద్రబాబు చెప్పినట్టుగా ప్రతి పది సెకన్లకు ఒకరు చనిపోతుంటే...ఇప్పటివరకూ ఎన్ని వేలమంది చనిపోయుండాలో లెక్కలు తెలియవా అని ప్రశ్నించారు. అసలాయనకు సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజుకు తేడా తెలుసా లేదా అని ప్రశ్నించారు. Also read: COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్’ అక్కడ మాత్రమే విక్రయాలు