గుజరాత్ రిజల్ట్స్.. స్వీట్స్ పంచిన ఏపీ మంత్రి

గుజరాత్ లో బీజేపీ ముచ్చటగా ఆరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న శుభసందర్భంలో ఆయన తన ఛాంబర్ లో సన్నిహితులకు స్వీట్లు పంచారు.

Last Updated : Dec 18, 2017, 06:16 PM IST
గుజరాత్  రిజల్ట్స్.. స్వీట్స్ పంచిన ఏపీ మంత్రి

సోమవారం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మిఠాయిలు పంచారు. గుజరాత్ లో బీజేపీ ముచ్చటగా ఆరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న శుభసందర్భంలో ఆయన తన ఛాంబర్ లో సన్నిహితులకు స్వీట్లు పంచారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఎన్ని ఆరోపణలు చేసినా.. ఎందరితో కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేరని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రాహుల్ గాంధీ కులాలను అడ్డుపెట్టుకొని గెలవాలనుకున్నా.. మోదీ సంస్కరణలతో అది సాధ్యం కాలేదని అన్నారు. మాణిక్యాలరావు ఏపీలో బీజేపీ తరుఫున 2014 గెలిచారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ -బీజేపీ కూటమిలో మంత్రిగా సేవలు అందిస్తున్నారు.  

బీజేపీ

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపు ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు. కానీ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్రితంసారి కంటే వెనుకబడింది. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో  కమలనాథులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా ఎన్నికల ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్  

కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలను  ఒక లిట్మస్ టెస్టుగా స్వీకరించింది. కానీ, హిమాచల్ ప్రదేశ్ లో రెండోసారి పాగా వేయాలన్న కాంగ్రెస్ ఆశలు అడిఆశలయ్యాయి. అయితే, బీజేపీ కంచుకోట, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ పార్టీకి హోరాహోరీ పోటీనిచ్చిందని స్వల్ప ఊరట చెందుతున్నారు కాంగ్రెస్ నాయకులు. 

Trending News