Ap Government: 100 బెడ్స్ ఆసుపత్రి నిర్మిస్తే..5 ఎకరాలు ఉచితం, ఢిల్లీ భేటీలో ఏపీ మంత్రి విడదల రజని

Ap Government: ఏపీ త్వరలో అంతర్జాతీయ స్థాయి హెల్త్‌హబ్‌గా మారనుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2022, 11:45 PM IST
Ap Government: 100 బెడ్స్ ఆసుపత్రి నిర్మిస్తే..5 ఎకరాలు ఉచితం, ఢిల్లీ భేటీలో ఏపీ మంత్రి విడదల రజని

ఆంధ్రప్రదేశ్‌లో 16 ప్రాంతాల్లో హెల్త్‌హబ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన  ప్రపంచస్థాయి ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ యూనిట్ల అధినేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచస్థాయి ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ యూనిట్ల అధిపతులతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో భేటీ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనితో పాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

మేదాంత, ద మెడ్‌సిటీ, మణిపాల్, పనాసియా ఇండియా, పోలీ మెడిక్యూర్ లిమిటెడ్, బాస్క్ అండ్ లోంబ్ ఐ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫార్మా స్యూటికల్స్ అలయెన్స్ , పారాస్ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్, పీడీ హిందూజా హాస్పిటల్స్, చార్‌నాక్ హాస్పిటల్స్, ఉజాలా సైనస్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ అందరికీ ఏపీలో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని వివరించారు. 

ప్రపంచస్థాయి ప్రమాణాలతో కనీసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఉచితంగా అందిస్తుందని మంత్రి విడదల రజని తెలిపారు. ఆసుపత్రుల్ని త్వరగా నిర్మించి...50 శాతం పడకల్ని ఆరోగ్యశ్రీ పథకం లబ్దిదారులకు కేటాయించాలన్నారు. ఫలితంగా పేదలకు కూడా ప్రపంచస్థాయి వైద్యం అందుతుందన్నారు. రాష్ట్రంలో 16 హెల్త్‌హబ్‌లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. హెల్త్‌హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు కల్పిస్తామన్నారు. 

Also read: Supreme Court: వివేకా హత్యకేసులో కీలక పరిణామం, కేసు సీబీఐ కోర్టుకు బదిలీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News