AP Schools & Colleges Bandh: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి నిరసన వ్యక్తమౌతోంది. వామపక్ష విద్యార్ధి సంఘాలు విద్యా సంస్థల బంద్ చేపట్టాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్లతో బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలు బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశాయి.
రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం రేపటికి వెయ్యి రోజులకు చేరుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్ధి సంఘాలు..అందరూ ఈ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ మూసివేసి తమ నిరసన తెలుపాలని వామపక్షాలు కోరాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పట్నించి నిరసన ఉద్యమం ప్రారంభమైంది.
అదే విధంగా రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రం ప్రభుత్వం స్వయంగా తామే చేపడతామని ప్రకటించినా ఫలితం లేకపోయింది. అటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. వామపక్ష విద్యార్ధి సంఘాలు.
Also read: Rythu Bharosa-PM Kisan: రైతులకు జగన్ సర్కారు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook