Ap Inter Exams 2024: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్, ఏ పరీక్ష ఎప్పుడంటే

Ap Inter Exams 2024: ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం పరీక్షల్ని మార్చ్ నెలలోనే పూర్తి చేయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ రోజు ఏ పరీక్ష అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2023, 05:37 PM IST
Ap Inter Exams 2024: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్, ఏ పరీక్ష ఎప్పుడంటే

Ap Inter Exams 2024: ఏపీలో పదవ తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి  30 వరకూ జరగనుండగా, ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 1 నుంచి 15 వరకూ పూర్తి కానున్నాయి. 2024లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తం పరీక్షల్ని మార్చ్ నెలలోనే పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. 

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలలు మార్చ్ 1 నుంచి 15 వరకూ ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్ధులకు ఏ పరీక్ష ఎప్పుడనే వివరాలతో పూర్తి టైమ్ టేబుల్ విడుదలైంది. 

ఇంటర్ మొదటి సంవత్సరం టైమ్ టేబుల్

మార్చ్ 1           సెకండ్ లాంగ్వేజ్ ( సంస్కృతం, హిందీ)
మార్చ్ 4           ఇంగ్లీషు
మార్చ్ 6           బోటనీ, సివిక్స్, మేథ్స్ పేపర్ 1ఎ
మార్చ్ 9           జువాలజీ, హిస్టరీ, మేథ్స్ పేపర్ 1బి
మార్చ్ 12         ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 14         కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 16         పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ మేథ్స్
మార్చ్ 19         మోడర్న్ లాంగ్వేజ్-4, జాగ్రఫీ

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్

మార్చ్ 2         సెకెండ్ లాంగ్వేజ్ ( సంస్కృతం-హిందీ)
మార్చ్ 5          ఇంగ్లీష్
మార్చ్ 7          మేథ్స్ పేపర్ 2ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 11        మేథ్స్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 13         ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 15         కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 18         పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ మేథ్స్
మార్చ్ 20         మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ

Also read: Tenth and Inter Exam Schedule: టెన్త్, ఇంటర్ షెడ్యూల్ ప్రకటన.. పరీక్షల తేదీలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News