AP High court: ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు నోటీసులు జారీ చేసింది.

Last Updated : Oct 10, 2020, 06:56 PM IST
AP High court: ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో స్థానిక సంస్థల ఎన్నికలు ( Local Body Elections )  మరోసారి తెరపైకి వచ్చాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు నోటీసులు జారీ చేసింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వ్యవహారం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఎన్నికల కమీషనర్ కరోనా కారణం చూపిస్తూ ఎన్నికల్ని వాయిదా వేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం చెందింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న రమేష్ కుమార్ ( SEC Ramesh kumar ) ను ఏపీ ప్రభుత్వం ( Ap Government ) తొలగించి..మరో వ్యక్తిని నియమించడం, తరువాత రమేష్ కుమార్ కోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయడం వంటి పరిణామాల నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పక్కనపడ్డాయి.గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలంటూ హైకోర్టు  ( Ap High court ) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ని ఆదేశించింది. ఇందులో భాగంగా ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలే నిర్వహిస్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చెప్పాల్సి ఉందంటూ.. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాదిని ధర్మాసనం వివరణ కోరింది. అయితే ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో లేకపోవడంతో ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కి వాయిదా వేసింది. Also read: AP EAMCET 2020 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

 

Trending News