Visakha steelplant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో కీలక పరిణామాలు

Visakha steelplant:విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే..మరోవైపు ఏపీ హైకోర్టు విచారణలో కీలక వ్యాఖ్యలు వెల్లడయ్యాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2021, 10:15 AM IST
Visakha steelplant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో కీలక  పరిణామాలు

Visakha steelplant:విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే..మరోవైపు ఏపీ హైకోర్టు విచారణలో కీలక వ్యాఖ్యలు వెల్లడయ్యాయి.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakha steelplant privatisation) అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఓ వైపు స్టీల్‌ప్లాంట్ ప్రాంగణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఆదేశించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు మరో వారం రోజులు గడువు కోరడంతో హైకోర్టు (Ap High Court)అసహనం వ్యక్తం చేసింది. ఇలాం కేసుల్లో జాప్యం మంచిది కాదని తెలిపింది. మరో వారం రోజులు గడువు విధిస్తూ ఇదే చివరి అవకాశామని...కౌంటర్ దాఖలు చేయాలని అల్టిమేటం జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకు వాయిదా వేసింది. మరోవైపు ప్రైవేటీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీన బిడ్డింగ్ ప్రక్రియకు సిద్ధమౌతోందని పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే అటువంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం(Central government) తరపు న్యాయవాది చెప్పడం విశేషం. ఈ కేసును జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారిస్తోంది. 

Also read: India Corona Udpate: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ ఉధృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News