AP High Court: రఘురామ కృష్ణరాజుకు ఎదురుదెబ్బ..విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న హైకోర్టు..!

AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీఐడీ విచారణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 29, 2022, 06:44 PM IST
  • ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు
  • సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
  • న్యాయవాది సమక్షంలో విచారణకు ఆదేశం
AP High Court: రఘురామ కృష్ణరాజుకు ఎదురుదెబ్బ..విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న హైకోర్టు..!

AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీఐడీ విచారణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగినట్లు అయ్యింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని నరసాపురం ఎంపీ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు ఫైల్ చేసింది. రాజద్రోహం కింద ఐపీసీ 124ఏ, 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. పిటిషనర్ రఘురామ కృష్ణరాజు తరపున బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దర్యాప్తు పేరిట తన క్లైంట్‌ను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈసందర్భంగా కోర్టుకు ముందుకు తీసుకెళ్లారు.

పిటిషనర్‌ ఏదైనా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా నోటీసుల పేరుతో అడ్డుకుంటున్నారని వివరించారు. ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉందని..అభిప్రాయాలు వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటోగా కేసులు పెట్టడం ఏంటన్నారు. ఇటు సెక్షన్ 124ఏ అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిందని..ఆ సెక్షన్ జోలికి వెళ్లమని ప్రభుత్వం తరపున ఏజీ స్పష్టం చేశారు.

మిగిలిన సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగిస్తామని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశించాలని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు..ఎంపీ రఘురామను హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారించాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

Also read: Indian Vice Presidential Election-2022: ఉపరాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా..ఆగస్టు 6న ఓటింగ్..!

Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News