ఏపీ ప్రజలకు ఎన్నికల సెలవులు; ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

                                    

Last Updated : Apr 4, 2019, 06:48 PM IST
ఏపీ ప్రజలకు ఎన్నికల సెలవులు; ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఎన్నికల పండగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులను అనుసరించి...పోలింగ్ జరిగే  ఏప్రిల్ 11వ తేదీ సెలవుదినం కానుంది. దీంతో పాటు పోలింగ్‌కు ముందు రోజు అంటే ఈ నెల 10తో పాటు, ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటించారు. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోఎన్నికల రోజు పబ్లిక్ హాలిడే ప్రకటించడం సర్వసాధారణం..అయితే పోలింగ్ కు ముందు రోజు మరియు ఫలితాల రోజు స్థానిక సెలవులుగా ప్రకటించడం గమనార్హం. ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునే సమయం ఇచ్చేందుకు పోలింగ్ ముందు తేదీని సెలవుగా ప్రకటించగా..ఎన్నికల ఫలితాల రోజు అందరి ఆసక్తి అంతా దానిపై ఉంటుందనే కారణంతో సెలవులు ప్రకటించినట్లు తెలిసింది.

Trending News