AP SEC: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేందుకు విఫలయత్నం చేశారు. ఫలితంగా తీవ్ర నిరాశకు లోనైనట్టు సమాచారం.
ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) పదవీకాలం ఇవాళ్టితో పూర్తవుతోంది. మరికొద్ది గంటల్లో ఆయన రిటైర్ కానున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రయత్నించారు. గవర్నర్ అప్పాయింట్మెంట్ కోరుతూ నాలుగు రోజుల క్రితమే రాజ్ భవన్ కార్యాలయం అధికారులకు సమాచారం అందించారు. అయితే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాత్రం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ని కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. ఆఖరికి నిన్న అంటే మార్చ్ 30 న కూడా గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు వస్తుందేమోనని ఎదురు చూశారు. ఎంతకీ గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది.
అంతకుముందు మార్చ్ 19వ తేదీన తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్(Governor Viswabhushan harichandan) ఒకరోజు ముందుగా సమాచారం అందించినా...హైదరాబాద్‌లో ఉన్నానంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆయన్ని కలవలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని మార్చ్ నెలాఖరులోగా పూర్తి చేసే అంశంపై చర్చించేందుకే గవర్నర్ అత్యవసరంగా మార్చ్ 19న కలవాలని ఎస్ఈసీని ఆదేశించారు. అయితే ఆ ఎన్నికల్ని జరిపించేందుకు ఆసక్తి చూపించని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వేరే కారణాలతో గవర్నర్‌ను కలవలేదు.
Also read: Tirupati Bypoll 2021: బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారంలో దిగనున్న జనసేనాని పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook