Biswabhushan Harichandan: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత-హైదరాబాద్‌కు తరలింపు

Governor Biswabhushan Harichandan hospitalised: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 08:51 AM IST
  • మరోసారి అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్
    ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు
    ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
 Biswabhushan Harichandan: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత-హైదరాబాద్‌కు తరలింపు

Governor Biswabhushan Harichandan hospitalised: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ విశ్వభూషణ్‌ (Biswabhushan Harichandan) హరిచందన్‌ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆదివారం (నవంబర్ 28) రాత్రి ఆయన్ను హైదరాబాద్‌ (Hyderabad) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. గవర్నర్‌ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే గవర్నర్ విశ్వభూషణ్ (Biswabhushan Harichandan) కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఆయనకు కరోనా పాజిటివ్‌గా (Covid 19) తేలడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజుల చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగటివ్‌గా తేలింది. దీంతో ఈ నెల 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

ఒడిశాకు (Odisha) చెందిన 87 ఏళ్ల విశ్వభూషణ్ హరిచందన్ రెండేళ్ల క్రితం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. 1971లో భారతీయ జనసంఘ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఆ తర్వాతి కాలంలో బీజేపీలో చేరారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో బీజేపీని వీడి జనతా పార్టీలో చేరిన ఆయన తిరిగి 1996లో కమలం గూటికి చేరారు. రాజకీయ నాయకుడి గానే కాక న్యాయవాది గానూ ఆయన (Biswabhushan Harichandan) మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Also Read: డాలర్ శేషాద్రి హఠాన్మరణం, విశాఖలో గుండెపోటుతో కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News