AP: రాష్ట్రంలో అదనంగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు

రాష్ట్రంలో  విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న వైెఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త వైద్య కళాశాలల పనులు ఊపందుకున్నాయి. అటు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది.

Last Updated : Nov 19, 2020, 05:03 PM IST
AP: రాష్ట్రంలో అదనంగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు

రాష్ట్రంలో  విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న వైెఎస్ జగన్ ప్రభుత్వం ( Ys Government ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త వైద్య కళాశాలల పనులు ఊపందుకున్నాయి. అటు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది.

ఏపీ ( AP ) లో ఇప్పుడు అదనంగా మరో 16 మెడికల్ కళాశాలలు ( 16 New medical colleges ) రాబోతున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంలో కాదు..పూర్తిగా ప్రభుత్వ వైద్య కళాశాలలు.  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆదేశాలకు అనుగుణంగా మరో 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మించబోతున్నారు.  ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు  ఊపందుకున్నాయి. 7 వేల 5 వందల కోట్ల ఖర్చుతో కొత్త వైద్య కళాశాలల్ని నిర్మిస్తున్నామని రాష్ట్ర వైగ్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ( Ap health minister Alla nani ) తెలిపారు. 

మరోవైపు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ( ysr village clinics ) కోసం వివిధ జిల్లాల్లో భవనాల నిర్మాణం చేపట్టామని మంత్రి నాని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో దాదాపు పది కోట్ల ఖర్చుతో డాక్టర్ వైెఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కానున్నాయన్నారు. దీనికి సంబంధించిన భవనాల నిర్మాణం ప్రారంభించామన్నారు. మరోవైపు  పశ్చిమ గోదావరి జిల్లాలో 12 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అభివృద్ధికి దాదాపు 95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. 

కోవిడ్ నివారణలో ఏపీ ..మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని చెప్పారు. అన్ని ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య పరీక్షల్ని( Covid19 tests )16 వందల నుంచి 8 వందలకు తగ్గించామన్నారు. Also read: AP: డిసెంబర్ 25న రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ

Trending News