AP Job Notifications: నిరుద్యోగులకు శుభవార్త, 3 నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు, సిలబస్‌లో మార్పులు

AP Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. మరో మూడు నెలల వ్యవధిలో భారీగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఏయే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2023, 01:48 PM IST
  • నిరుద్యోగులకు శుభవార్త, ఏపీలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు
  • రానున్న 3 నెలల్లో 20 రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకు సన్నాహాలు, వేలల్లో ఉద్యోగాల భర్తీ
  • మే 3వ వారంలో గ్రూప్ 4 ఫలితాలు, మారిన గ్రూప్ 2 సిలబస్
AP Job Notifications: నిరుద్యోగులకు శుభవార్త, 3 నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు, సిలబస్‌లో మార్పులు

AP Job Notifications: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో గ్రూప్ -1 తో పాటు జూనియర్ లెక్చరర్ల పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల భర్తీ ఉన్నాయి. మొత్తం 20 నోటిఫికేషన్లు వెలువరించేందుకు రంగం సిద్ధమౌతోంది.

ఏపీ ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకారం పెద్దఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. రానున్న 3 నెలల కాలంలో ఏకంగా 20 రకాల జాబ్ నోటిఫికేషన్స్ రానున్నాయి. మరోవైపు గ్రూప్ 2 సిలబస్‌లో మార్పులు చేసింది. ఇప్పటికే ప్రారంభమైన గ్రూప్ 1లో 111 పోస్టుల నియామక ప్రక్రియను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. గ్రూప్ 4 ఫలితాలు మే 3వ వారంలోగా విడుదల కానున్నాయి. వీటితో పాటుగా కొత్తగా నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రూప్ -1లో 140 పోస్టులు భర్తీ చేయనుండగా, గ్రూప్ 2లో 1000 పోస్టులు ఖాళీలున్నాయి. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 400 డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతోపాటు జూనియర్ లెక్చరర్ల భర్తీకై ప్రభుత్వం నుంచి క్లియరన్స్ రాగానే..మరో నోటిఫికేషన్ వెలురించేందుకు ఏపీపీఎస్సీ ప్రయత్నిస్తోంది. ఇక పంచాయితీ రాజ్, ఇరిగేషన్ వంటి వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడవచ్చు. 

మారిన గ్రూప్ 2 సిలబస్

ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పోస్టుల భర్తీ ప్రక్రియలో సిలబస్ మార్పులు జరుగుతున్నాయి. పాత సిలబస్ ప్రకారం హిస్టరీ, పాలిటిక్స్ కు 75 మార్కులుంటే ఎకనామిక్స్ ఒక్క సబ్జెక్ట్‌కే 150 మార్కులుండేది. ఫలితంగా ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్టుగా చదివినవారికి న్యాయం జరిగి..మిగిలినవారికి అన్యాయం జరుగుతుందనే విమర్శలుండేవి. దీంతో ఎకనామిక్స్ కూడా 75 మార్కులకు కుదించి..మిగిలిన 75 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీను కలిపారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను వివరించే ఇండియన్ సొసైటీ పేరుతో కొత్త సిలబస్ చేర్చారు. స్థూలంగా చెప్పాలంటే అన్ని గ్రూపుల అభ్యర్ధులకు న్యాయం జరిగేలా గ్రూప్ 2 సిలబస్ మార్పులు జరిగాయి. 

న్యాయపరమైన చిక్కుల్లేకుండా జాగ్రత్త పడుతూ వివిధ శాఖల నోటిఫికేషన్లు వెలువరించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. అన్ని నోటీఫికేషన్లు వెలువడితే వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ సకాలంలో పూర్తి కావచ్చు. మొత్తం 20 రకాల నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి.

Also read: Cyclone Alert: మే 8న తుపాను హెచ్చరిక, మరి కొద్దిరోజులు భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News