AP IT Policy 2021-24: ఐటీ రంగం అభివృద్దికి ఏపీ ప్రత్యేక దృష్టి, 2021-24 కొత్త ఐటీ పాలసీ విడుదల

AP IT Policy 2021-24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీను విడుదల చేసింది. ప్రోత్సాహకాలు అందిస్తూ..ఐటీ రంగాన్ని అభివృద్ది చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రానున్న నాలుగేళ్ల కోసం ఏపీ ఐటీ పాలసీ 2021-24 విధి విధానాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 17, 2021, 11:39 AM IST
AP IT Policy 2021-24: ఐటీ రంగం అభివృద్దికి ఏపీ ప్రత్యేక దృష్టి, 2021-24 కొత్త ఐటీ పాలసీ విడుదల

AP IT Policy 2021-24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీను విడుదల చేసింది. ప్రోత్సాహకాలు అందిస్తూ..ఐటీ రంగాన్ని అభివృద్ది చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రానున్న నాలుగేళ్ల కోసం ఏపీ ఐటీ పాలసీ 2021-24 విధి విధానాలు ఇలా ఉన్నాయి.

కోవిడ్ 19 కారణంగా అన్నిరంగాల్లో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో మారుతున్న పరిణామాల్ని అందిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం (Ap government)సిద్దమైంది.ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు పెద్దపీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రానున్న నాలుగేళ్ల కోసం ఏపీ ఐటీ పాలసీ 2021-24 (AP IT Policy 2021-24)విడుదల చేసింది. వర్క్ ఫ్రం హోం పెరుగుతుండటంతో ఐటీ ప్రాజెక్టుకులు చేసుకునే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. ఐటీ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీల్ని అందించనుంది.

రాష్ట్రంలో ఐటీ క్యాంపస్, ఐటీ పార్కులు నిర్మించదలిచే సంస్థలకు ఉద్యోగాల ఆధారంగా భూములు కేటాయించనున్నారు. పదివేలమంది ఉద్యోగుల్ని కలిగి ఉండటంతో పాటు వరుసగా మూడేళ్లపాటు 5 వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉంటే రాష్ట్రంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు. విదేశీ కంపెనీ అయితే ఫార్చ్యూన్ 1000 కంపెనీ అయుండాలి. ఐటీ పార్కుల్లో కనీసం పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసే సంస్థలకు అనుమతి ఉంటుంది. ఐటీ పార్కులు నిర్మించే సంస్థలు వరుసగా మూడేళ్లు 25 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. భూమిని కేటాయించిన ఆరేళ్లలోగా..ప్రతి ఎకరాకు 5 వందల ఉద్యోగాలు కల్పించాలి. పది ఎకరాలకు కేటాయింపులో అభివృద్ధి చేసిన భూమిలో 30 శాతం ఇతర అవసరాలకు అనుమతిస్తారు. ఒక సంస్థకు గరిష్టంగా పది లక్షల వరకూ రాయితీ ఉంటుంది. ఇక వర్క్ ఫ్రం చేసే గిగ్ వర్కర్ల కోససం ప్రత్యేక రాయితీల్ని ప్రకటించారు. అన్ని ప్రభుత్వ సంస్థలు స్థానిక కంపెనీల్నించే ఐటీ కొనుగోళ్లు చేయాలన్న నిబంధన పెట్టారు. ఫలితంగా కొత్తగా వచ్చే ఐటీ కంపెనీ(IT Companies)లకు మద్దతు ఉంటుంది.

Also read: Corona Third Wave: ముంచుకొస్తున్న కరోనా థర్డ్‌వేవ్, 100 రోజులు అత్యంత కీలకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News