AP Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో గత 3-4 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) భయంకర రూపం దాల్చేసింది. రెండ్రోజుల్నించి ఏకంగా 3.5 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.పెరుగుతున్న కేసుల నేపధ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్, బెడ్స్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ( Remdesivir injections shortage) తీవ్రమైంది. ఆక్సిజన్ లభించక Oxygen shortage) కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ( Night Curfew) అమలు చేస్తుంటే..మహారాష్ట్ర, ఢిల్లీల్లో లాక్‌డౌన్ ( Lockdown) విధించారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ఏపీ ( AP ) లో కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 62 వేల 885 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid 19 tests) చేయగా..12 వేల 634 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. 24 గంటల్లో కరోనా కారణంగా ఏపీలో 69 మంది మరణించారు. మరోవైపు 4 వేల 304 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9 లక్షల 36 వేల 143 మంది కోలుకోగా..ఇంకా రాష్ట్రంలో 89 వేల 732 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ అత్యధికంగా 1 కోటి 59 లక్షల 94 వేల 607 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.కోవిడ్ సంక్రమణ, చికిత్స నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లలో సిటీ స్కాన్ పరీక్షలకు ( CT Scan Price) 3 వేలకు మించి వసూలు చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
Also read: Ap government Special Orders: కోవిడ్ సంక్రమణ దృష్ట్యా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook