కరోనా థర్డ్‌వేవ్‌కు రాష్ట్రంలో 462 ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధం

Corona Third Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇప్పుడు అంతా కరోనా థర్డ్‌వేవ్ ముప్పుపైనే ఆందోళన నెలకొంది. థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2021, 11:11 AM IST
కరోనా థర్డ్‌వేవ్‌కు రాష్ట్రంలో 462 ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధం

Corona Third Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇప్పుడు అంతా కరోనా థర్డ్‌వేవ్ ముప్పుపైనే ఆందోళన నెలకొంది. థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైంది. 

కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)ముప్పు ఇండియాను వెంటాడుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా థర్డ్‌వేవ్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు  అన్ని విధాలా సంసిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 462 ప్రైవేటు ఆసుపత్రుల్ని సిద్ధం చేసింది. ఇవి కాకుండా రాష్ట్రంలోని టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చాలావరకూ 50 నుంచి 10 బెడ్స్ సౌకర్యం కలిగిన ఆసుపత్రులున్నాయి. వంద కంటే ఎక్కువ బెడ్స్ ఉన్నవి 65 ఉన్నాయి. కరోనా చికిత్స, సేవలో భాగంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రులు 33 వేల 793 డీటైప్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా 17 వేల 841 కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. కరోనా థర్ద్‌వేవ్‌ను అన్ని విధాలా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

మరోవైపు సాధారణ బెడ్స్‌తో పాటు ఆక్సిజన్ బెడ్స్ కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. ఏ సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 63, కృష్ణా జిల్లాలో 60 ఆసుపత్రులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చదువుతున్న నర్శింగ్, పారా మెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్ధుల్ని కోవిడ్ సేవల్లో ప్రభుత్వం (Ap government) ఉపయోగించుకోనుంది. 

Also read: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News