కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid19 Vaccine) పై ఏపీ ప్రభుత్వం ( Ap Government ) కీలక నిర్ణయం తీసుకుంది. మరి కొన్నిరోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో రానుండటంతో వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఏపీలో ముందుగా వ్యాక్సిన్ ఎవరికి అందించాలో నిర్ణయించింది.
కోవిడ్ 19 వైరస్ ( Corona virus ) నియంత్రణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రాణాల్ని పణంగా పెట్టి రేయింబవళ్లు పనిచేస్తున్నవారిని కాపాడుకోడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కరోనా వ్యాక్సిన్ ఇండియాలో మరి కొన్నిరోజుల్లో అందుబాటులో రానుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికే మొదటిగా వ్యాక్సిన్ అందించేందుకు రంగం సిద్ధవుతోంది. జిల్లాలో వైద్యులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ఇవాళ సాయంత్రానికి సమర్పించాలని కోరింది. దాంతో అన్ని వైద్యవిభాగాలు నిన్నటి నుంచి ఇదేపనిలో నిమగ్నమయ్యాయి.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine Distribution ) త్వరలోనే పంపిణీకి సిద్ధం చేస్తుండటంతో ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి అందించేలా జాబితాను సిద్ధం చేస్తున్నారు. వైద్యశాఖ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు రూపొందించిన వెబ్‌సైట్‌లో నేరుగా వివరాలను పొందుపరుస్తున్నారు. దీనిని ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పూర్తి సమాచారం, వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని వెబ్‌సైట్‌లో జత చేసి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు.
వైద్యసిబ్బందితో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల వివరాలను సైతం సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండటంతో రాష్ట్ర యంత్రాంగం ఈ పనిలో పడింది. నేరుగా ఆసుపత్రుల నిర్వాహకులకు ఫోన్లు చేసి వివరాలు రప్పించుకుంటున్నారు. Also read: AP: రెండోసారి కరోనా సోకడంతో యువ వైద్యుడి మృతి