AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.
జేఈఈ మెయిన్స్ పరీక్షల నేపధ్యంలో ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సి ఉన్నాయి. అయితే ఈలోగా జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యుల్ విడుదల కావడంతో ఇటు ఇంటర్ అటు జేఈఈ పరీక్షలు ఒకే రోజు వచ్చాయి. ఫలితంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు మాత్రం ముందు అనుకున్నట్టే..మార్చ్ 11 నుంచి 31 వరకూ జరగనున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై..మే 12 వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు, రెండవ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకూ రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్
ఏప్రిల్ 22 సకెండ్ లాంగ్వేజ్ పేపర్ 1
ఏప్రిల్ 25 ఇంగ్లీష్ లాంగ్వేజ్
ఏప్రిల్ 27 మేధమెటిక్స్ పేపర్ ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
ఏప్రిల్ 29 మేధమేటిక్స్ పేపర్ బి, జువాలజీ, హిస్టరీ
మే 2 ఫిజిక్స్, ఎకనామిక్స్
మే6 కెమిస్ట్రీ, కామర్స్
మే 9 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , బ్రిడ్జ్ కోర్స్ మేధమేటిక్స్
మే 11 మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
ఏప్రిల్ 23 సెకండ్ లాంగ్వేజ్ 2
ఏప్రిల్ 26 ఇంగ్లీషు పేపర్
ఏప్రిల్ 28 మేధమేటిక్స్ , బోటనీ, సివిక్స్
ఏప్రిల్ 30 మేధమేటిక్స్ , జువాలజీ, హిస్టరీ
మే 5 ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 7 కెమిస్ట్రీ కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్
మే 10 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్ మేధ్స్ పేపర్
మే 12 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియాగ్రఫీ పేపర్ 2
Also read: AP Rain Forecast: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook