AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో ఇప్పుడు దాదాపుగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెరిగినా పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగదల లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతికి మొన్నటి వరకూ తల్లడిల్లిన ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచుతోంది. ప్రతిరోజూ 80-95 వేల మధ్యలో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఇంకోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది.
గత 24 గంటల్లో ఏపీలో 95 వేల 327 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..4 వేల 250 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 33 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 12 వేల 599కు చేరుకుంది. గత 24 గంటల్లో 5 వేల 570 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 లక్షల 22 వేల 5 వందలమంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 17 లక్షల 32 వేల 933 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు.
Also read: Twins Record: ఆ ఇద్దరూ కవల సోదరులు..గూగుల్‌లో రికార్డు స్థాయిలో వేతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook