Ap Government: కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా ధర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనల్ని మరో పదిహేనురోజులు పొడిగించిన ప్రభుత్వం..మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా..కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)ముప్పు వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో కరోనా నియంత్రణ చర్యల్ని కఠినం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ నిబంధనల్ని మరో పదిహేనురోజుల వరకూ అంటే ఆగస్టు 14 వరకూ పొడిగించింది. మాస్క్ లేకుండా తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మాస్క్ లేకుండా అనుమతిస్తే..10 వేల నుంచి 25 వేల వరకూ భారీ జరిమానా విధించనుంది. జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ధారించనున్నారు. అదే విధంగా 2-3 రోజులపాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ (Night Curfew)ఆంక్షలు ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అమలులో ఉంటాయి. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను(Covid Protocol) తప్పనిసరిగా పాటించాలని..ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మాస్క్‌లు ధరించకపోతే వంద రూపాయలు జరిమానా విధించే అధికారం స్థానిక ఎస్ఐ, ఆ పై పోలీసు అధికారులకు ఉంటుంది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించి ఫోటోలు పంపితే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం 8010968295 ప్రత్యేక వాట్సప్ నెంబర్ కేటాయించారు.
Also read: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook