Vaccine Tenders: వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం

Vaccine Tenders: కరోనా కట్టడికై ఏపీ ప్రభుత్వం కీలకమైన సమీక్ష జరిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై చర్చించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 13, 2021, 07:34 PM IST
Vaccine Tenders: వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం

Vaccine Tenders: కరోనా కట్టడికై ఏపీ ప్రభుత్వం కీలకమైన సమీక్ష జరిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై చర్చించారు.

రాష్ట్రంలో గత వారంలో రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 96 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Test) చేయగా..22 వేల పాజిటివ్ కేసులు తేలాయి.ఈ నేపధ్యంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం(Ap government) సమావేశమైంది. కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యాన సమీక్షలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై సమీక్షలో చర్చించారు. 

రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ (Vaccine) వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) నిర్ణయించారు. ఉచిత వ్యాక్సినేషన్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఒకేరోజు 6 లక్షల వ్యాక్సిన్లు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు (Vaccine global tenders) వెళ్లడానికి ప్రభుత్వం నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్లోబల్ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. 3 వారాల్లోగా కంపెనీలు తమ ఆసక్తిని చెప్పాలని ప్రభుత్వం కోరింది.

Also read: Ap Covid Update: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News