AP Medical Colleges: ఏపీలో 5 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఎన్నెన్ని కేటాయింపు

AP Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది ప్రారంభం కానున్న 5 కొత్త వైద్య కళాశాలల్లో ఈ విధానం అమలు కానుంది. ఆ విధానం ఎలా ఉంటుందోనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 21, 2023, 02:13 AM IST
AP Medical Colleges: ఏపీలో 5 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఎన్నెన్ని కేటాయింపు

AP Medical Colleges: ఏపీలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఈ ఏడాది నుంచి 5 వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం అమల్లోకి రానుంది. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు కళాశాలలకు దీటుగా మలిచేందుకు ఈ విదానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

ఏపీలో కొత్తగా ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలలతో కలిపి మొత్తం 17 మెడికల్ కళాశాలలు ఉంటాయి. ఈ ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది నుంచి మరో ఐదు కళాశాలలు మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి, పాడేరు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. మరో 7 మెడికల్ కళాశాలల్ని 2025-26 నుంచి ప్రారంబించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటికే 8,480 కోట్ల రూపాయలతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. 

ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభం కానున్న 5 మెడికల్ కాలేజీల్లో కొత్తగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం ఈ 5 కళాశాలల్లో 15 శాతం ఆల్ ఇండియా కోటా ఉంటుంది. మిగిలినవాటిని మూడు భాగాలు చేశారు. అంటే 750 సీట్లలో112 సీట్లు ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. మిగిలిన 638 సీట్లను మూడు భాగాలు చేస్తారు. వీటిలో 50 శాతం సీట్లు అంటే 319 సీట్లు జనరల్ కేటగరీకి ఏడాదికి 15 వేల ఫీజుతో కేటాయిస్తారు. మిగిలిన 35 శాతం అంటే 223 సీట్లు ఏడాదికి 12 లక్షల చొప్పున అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో ఉంటాయి. ఇక మిగిలిన  95 సీట్లు ఏడాదికి 20 లక్షల చొప్పున ఎన్ఆర్ఐ విభాగంలో కేటాయింపులుంటాయి.సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా వచ్చే డబ్బుల్ని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ కు డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతోనే వైద్య కళాశాలల అభివృద్ధి ఉంటుంది.

Also read: AP Heavy Rains: పది రోజుల్లో రెండు అల్పపీడనాలు, ఏపీ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News