Papikondalu Tourism: గోదావరి పర్యాటకులకు గుడ్‌న్యూస్. పచ్చదనం నిండా పర్చుకున్న అందాల్ని వీక్షించేందుకు అవకాశం లభిస్తోంది. అద్భుత అందాల నిలయమైన పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో పాపికొండల నడుమ పర్యాటకం ఊపందుకోనుంది.
గోదావరి అంటేనే గుర్తొచ్చేది పాపికొండలు(Papikondalu). గోదావరి అందాలు.హొయలు చూడాలంటే పాపికొండల నడుమే చూడాలి. ఒంపులు తిరుగుతూ వయ్యారాలు ఒలకబోస్తూ..ప్రశాంతంగా..ఆహ్లాదంగా సాగుతుంది గోదావరి. అందుకే గోదావరి అందాలు (Goadavari Beauty) చూడాలంటే పాపికొండలు వెళ్లి తీరాల్సిందే. కచ్చులూరు వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంతో 19 నెలల తరువాత తిరిగి ప్రారంభం కానుంది. వాస్తవానికి ఏప్రిల్ 15వ తేదీనే బోటు ట్రయల్ రన్ ప్రారంభమైనా..కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. కరోనా ఉధృతి తగ్గుతుండటంతో ఇప్పుడు మరోసారి గోదావరి పర్యాటకానికి పర్యాటక శాఖ (Ap Tourism Department) సన్నద్దమవుతోంది.
కచ్చులూరు బోటు ప్రమాదం (Kachuluru Boat Accident) అనంతరం ప్రభుత్వం కఠిన నిబంధనల్ని విధించింది. బోటు ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాటు మండలం పేరంటాల పల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క కంట్రోల్ రూమ్‌కు 22 లక్షల నిధుల్ని కేటాయించారు. బోటు ప్రయాణాల్ని పర్యవేక్షించేలా ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ప్రయాణీకులకు లైఫ్ జాకెట్లు సమకూర్చడంతో పాటు ప్రయాణ అనుకూల పరిస్థితి, బోటు కండీషన్ తదితర అంశాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. గోదావరి నదిపై ప్రయాణించే బోట్లకు సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. బోటు లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకునేలా జీపీఎస్ ఏర్పాట్లు చేసింది. ఈ నెలాఖరుకు పాపికొండల పర్యాటకం (Papikondalu Tourism) ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also read: Gunfire In AP: కడప జిల్లాలో కాల్పుల కలకలం, ఒకరి హత్య, ఆపై ఏం చేశాడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook