AP Government: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్

AP Government: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త విన్పిస్తోంది. ఓవైపు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సన్నాహాలు చేస్తూనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2024, 11:54 AM IST
AP Government: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్

AP Government: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే టీచర్ల నియామకానికి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఈ నెలాఖరులో అంటే జనవరి 31న జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆస్కారముంది. ఉద్యోగులు, రైతాంగం, మహిళలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. త్వరలో వెలువరించనున్న డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే టెట్ నోటీఫికేషన్ సిద్ధమైంది. 2022, 2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ చేసిన వారికి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్థానం కల్పించే ఉద్దేశ్యంతో టెట్ నిర్వహించనున్నారు. టెట్ చివరిసారిగా రెండేళ్ల క్రితం 2022 ఆగస్టు నెలలో జరిగింది. అప్పట్లో 4.5 లక్షలమంది టెట్ పరీక్షకు దరఖాశ్తు చేసకుంటే 2లక్షలమంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి ఏకంగా 45 లక్షలమంది టెట్ పరీక్ష రాయవచ్చని అంచనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్ధులకు టెట్ పరీక్షలో పేపర్ 2ఏ రాసేందుకు అర్హతను డిగ్రీలో 50 శాతం కాకుండా 40 మార్కులకు కుదించారు. ఇతర ఓసీ వర్గాలకు మాత్రం 50 శాతం ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం మార్కులు రిలాక్సేషన్ ఇచ్చింది. టెట్ పేపర్ 1 రాసే అభ్యర్ధులకు ఇంటర్ 50 శాతం మార్కులతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విభాగంలో రెండేళ్ల డిప్లొమా, 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

Also read: Amazon Offers: Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు, అమెజాన్‌లో మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News