AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు

AP CM YS Jagan: దసరా పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. అటు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ వెలువరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 21, 2023, 03:23 PM IST
AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు

AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం వందలాది కాంట్రాక్ట్ ఉద్యోగులకు విజయ దశమి కానుక ఇచ్చింది.  ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్టు ఉదోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల వేళ కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తాననే హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఇటీవలే ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం తరువాత ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తూ చేసిన బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పుడీ బిల్లుకు సంబంధించిన గెజిట్‌ను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. అంటే కాంట్రాక్టు ఉద్యోగుల ఇకపై రెగ్యులర్ ఉద్యోగులుగా మారిపోయారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు ఏపీలోని 11 బోధనాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 99 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో , డీఎంఈ కార్యాలయంలో ఇప్పటికే మంజూరై భర్తీ కాకుండా వివిధ కేటగరీల్లో ఉన్న పోస్టుల్ని రద్దు చేసింది. ఆ పోస్టుల స్థానంలో కొత్త పోస్టుల్ని సృష్టించింది. ప్రతి బోధనాసుపత్రికి ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్ పోస్టును కేటాయించింది. ఈ పోస్టును స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ , కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీ కేటగరీలో భర్తీ చేస్తారు. 

ఈ పోస్టుల్ని కాంట్రాక్టు విధానంలో కాకుండా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందులో అడిషనల్ డైరెక్టర్ పోస్టులు 2, నోడల్ ఆపీసర్ పోస్టులు 8, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 1, డేటా ఎనలిస్టులు2, ఎంఐఎస్ మేనేజర్ 1, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టుులు 8 ఉన్నాయి. 

Also read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఇప్పట్లో ఊరట లభించదా, దసరా సైతం జైళ్లోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News