Ap Covid Update: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్దఎత్తున కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి ఇండియా విలవిల్లాడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులు మరోవైపు అత్యవసరాల కొరత. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరత తీవ్రమవుతోంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ బాట పడ్డాయి. ఇటు ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో సైతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిరోజూ పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల సామర్ధ్యం పెరిగే కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఏపీలో లక్షకు పైగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
తాజాగా 24 గంటల్లో ఏపీలో 1 లక్షా 5 వేల 494 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించగా 22 వేల 164మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 12 లక్షల 87 వేల 603 మందికి కరోనా సోకగా..నిన్న ఒక్కరోజులోనే 92 మంది మరణించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 8 వేల 707 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 18 వేల 832 మంది చికిత్స అనంతరం కోలుకోగా..ప్రస్తుతం రాష్ట్రంలో 1 లక్షా 90 వేల 632 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 73 లక్షల 67 వేల 935 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Also read: Oxygen plants: ఏపీలో భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, 3 వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook