ఏపీ రాజధాని తరలింపు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సచివాలయ ఉద్యోగులు కోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం వేచి చూస్తోంది. మరోవైపు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు కోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేయడం ద్వారా కీలకమైన ఆసక్తికరమైన వాదనను కోర్టు ముందు ఉంచారు. రాష్ట్ర రాజధాని అనేది భూములిచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని..ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హక్కు అని సచివాలయ ఉద్యోగులు పిటీషన్ లో పేర్కొన్నారు. మరోవైపు రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ...రైతులు కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగినప్పుడు స్పందించని అమరావతి పరిరక్షణ సమితి..పేదలకు ఇళ్లపట్టాలిస్తుంటే ఎందుకు అడ్డుపడుతుందని ప్రశ్నించారు.
అమరావతి రాజధానికి సంబంధించి 70 శాత పనులు పూర్తయ్యాయంటూ పిటీషన్ వేయడం వెనుక కొందరు రాజకీయనేతల రియల్ ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం అందించిందన్నారు. రాజధాని తరలింపును ఏ ఉద్యోగసంఘం కూడా వ్యతిరేకించలేదన్నారు. Also read: Ap: కరోనా రావడం పాపం కానేకాదు: వైఎస్ జగన్