AP Corona Update: ఏపీలో కరోనా సంక్రమణ, గత 24 గంటల్లో కొత్తగా 629 కేసులు

AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా సంక్రమణ కొద్దిరోజులు స్థిరంగా ఉంటే..కొద్దిరోజులు తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2021, 04:04 PM IST
AP Corona Update: ఏపీలో కరోనా సంక్రమణ, గత 24 గంటల్లో కొత్తగా 629 కేసులు

AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా సంక్రమణ కొద్దిరోజులు స్థిరంగా ఉంటే..కొద్దిరోజులు తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్(Ap Corona Update) సంక్రమణ క్రమంగా తగ్గుతోంది. గత కొద్దిరోజుల క్రితం కరోనా సంక్రమణ పెరిగినా..ఆ తరువాత చాలా రోజులు స్థిరంగా కొనసాగాయి. ఇప్పుడు మరోసారి కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 45 వేల 818 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 629 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8 మంది కోవిడ్ కారణంగా మరణించారు. మరోవైపు 797 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 8 వేల 134 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా ప్రభావం గతంలో కూడా వేసవిలో ఎక్కువగా ఉంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో వచ్చే వేసవికి కరోనా ఫోర్త్‌వేవ్ వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: Russia Plane Crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం, 16 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News