కరోనా వైరస్ ( Corona virus ) నియంత్రణలో ఏపీ ప్రభుత్వం ( Ap Government ) తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో ఇప్పుడు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అటు రికవరీ రేటు భారీగా పెరిగింది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కేంద్రం ప్రశంసించింది.
మొన్నటివరకూ భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రజలు గజగజలాడారు. గత కొద్దికాలంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 74 వేల 422 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 3 వేల 746 మందికే పాజిటివ్ గా తేలింది. గతంలో అంటే 15-20 రోజులకు ముందు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. ప్రతిరోజూ 10-11 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. ఓ దశలో దేశంలో రెండవ అత్యధిక కేసులున్న రాష్ట్రంగా మారింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని మాత్రం ప్రభుత్వం ఆపలేదు. ఫలితంగా గత పదిహేను రోజుల్నించి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 7 లక్షల 93 వేల 299గా ఉంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ( Ap Health ministry ) విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వివరాలు ఊపిరిపీల్చుకునేలా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4 వేల 739 మంది కోలుకోగా.. మొత్తం ఇప్పటివరకూ రాష్ట్రంలో 7లక్షల 54 వేల 415 మంది కోలుకున్నారు. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో 27 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడగా.. మొత్తం ఇప్పటివరకూ 6 వేల 508 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల ( Corona active cases ) సంఖ్య కేవలం 32 వేల 376 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 72 లక్షల 71 వేల 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests ) నిర్వహించారు. ఏపీలో ప్రతి మిలియన్ జనాభాకు 1 లక్షా 36 వేల 162 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ రేటు 10.91 శాతానికి పడిపోయింది.
Also read: AP: మరో కీలక పథకం, వైఎస్సార్ భీమా ప్రారంభించిన వైఎస్ జగన్
రాష్ట్రంలో తగ్గుతున్న కేసులతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను తగ్గించటంలో విజయం సాధించామని, కరోనాతో మృత్యువాత పడేవారి సంఖ్య కూడా బాగా తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. కరోనా వైరస్ ను మరింతగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి నెలాఖరు వరకూ ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. విజయవాడలో భారీ ర్యాలీ ఏర్పాటైంది.
అన్ లాక్ ( Unlock ) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్నీ పునరుద్ధరించామని..ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ పెరగకుండా సహకరించాలని నీలం సాహ్ని కోరారు. కోవిడ్ నేపథ్యంలో రానున్న పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) .. జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించారు.
గత కొద్దికాలంగా కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అటు రికవరీ రేటు బాగా పెరిగింది. ఓ దశలో యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు దాదాపు సగమున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే...నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో జీరో కేసులకు చేరవచ్చనేది అంచనా. Also read: AP: రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల నియామకం
AP Corona Update: డిసెంబర్ మొదటి వారంలోగా రాష్ట్రంలో జీరో కేసులు?
ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 7 లక్షల 93 వేల 299
మొత్తం కోవిడ్ పరీక్షలు రాష్ట్రంలో..72 లక్షల 71 వేల 50
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేల 376 మాత్రమే