AP: ఆగని కరోనా వైరస్..రికార్డు స్థాయిలో పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ దాదాపు 9-10 వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు పరీక్షలు కూడా భారీగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. 

Last Updated : Aug 22, 2020, 10:52 PM IST
AP: ఆగని కరోనా వైరస్..రికార్డు స్థాయిలో పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ దాదాపు 9-10 వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు పరీక్షలు కూడా భారీగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. 

ఏపీ ( Ap ) లో కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ ఇంకా ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రికార్డు స్థాయిలో ఏపీ కరోనా నిర్ధారణ ( Covid19 tests ) పరీక్షలు చేస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 61 వేల 469 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..10 వేల 276 మందికి పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 45 వేల 216కు చేరుకోగా..2 లక్షల 52 వేల 638 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89 వేల 389 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 97 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్రం మొత్తం మీద రికార్డు స్థాయిలో 31 లక్షల 91 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. Also read: Chiru Birth day: పద్మభూషణ్ చిరుకు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్

Trending News