కేంద్రప్రభుత్వం ( Central Government ) నూతనంగా తీసుకొచ్చిన విద్యావిధానం ( New Education Policy ) త్వరలో అమలు కానుంది. ఈ విద్యావిధానం అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
విద్యావిధానంలో సమూల మార్పులు రానున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఈ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ( Ap cm ys jagan review ) నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త చట్టం అమలు, ప్రయోజనాలపై ఉన్నతాధికార్లతో సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఇప్పటికే విద్యా ఆరోగ్యానికి రాష్ట్రంలో పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యావిధానం అమలు విషయంపై ఫోకస్ పెట్టారు.
అయితే ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని అంశాలు కొత్త చట్టంలో ఉన్నాయనే విషయాన్ని చర్చించారు. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలనేది ముందుగానే తీసుకున్న నిర్ణయంగా ఉంది. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాల్సి ఉంది. పీపీ1, పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచనున్నారు. హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయి కానీ అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే. 10 తరగతిలో బోర్డు పరీక్షలు యధావిధిగా ఉంటాయి. ఉన్నత విద్యను సైతం నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. Also read: Amaravati land scam: వేగం పుంజుకున్న భూ కుంభకోణం కేసు